న్యూఢిల్లీ : స్టూల దేశీయ ఉత్పత్తి భారీగా పడిపోయింది. 2019-2020 మొదటి త్రైమాసికం 5 శాతానికి చేరింది. గత క్వార్టర్‌లో 5.8 నుంచి .. పాయింట్ 8 శాతానికి తగ్గింది. ఇది గత ఐదేళ్లలో కనిష్టమని పేర్కొంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా జీడీపీ 6.8గా ఉంది. కానీ చివరి క్వార్టర్‌లో మాత్రం 5.8 శాతంగా ఉందని అధకారులు పేర్కొన్నారు. అదీ ఆగస్టు త్రైమాసికానికి మరింత దిగజారిందని వివరించారు.
2018-2019 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి జనవరి-మార్చి త్రైమాసికంలో 5.8 శాతానికి చేరింది. దేశ ఆర్థికరంగం కుదేలవడంతో .. జీడీపీ క్రమంగా తగ్గుతుంది. ఇదీ ముఖ్యంగా ఆటో, తయారీ, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రభావం చూపనుంది. దీనికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఓ కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపిందని .. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువని తెలుస్తోంది. దీనికితోడు విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి.
దేశీయ ఉత్పత్తి ప్రభావం బ్యాంకులపై కూడా పడింది. దీంతో బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు జాతీయ బ్యాంకులు తాము తీసుకున్న నగదును రిజర్వ్ బ్యాంక్‌కు సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. దీనికితోడు ఆర్బీఐ రెపో రేటును కూడా తగ్గించింది. కాసేపటి క్రితమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్థిక మందగమనానికి బ్యాంకుల విలీనం ఊతమిస్తోందని అంచనా వేశారు.
