ఐసిఎఫ్, సెప్టెంబరు 14: రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయనున్న ప్లాస్టిక్ బాటిళ్ల క్రషింగ్ యంత్రాలను వినియోగించే ప్రయా ణికుల మొబైల్‌కు రీచార్జ్, టాపప్ చేయనున్నట్లు రైల్వేబోర్డు తెలిపింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపడుతున్నాయి. వాటికి ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లలో ఒక సారి వినియోగించే ప్లాస్టిక్ బాటిళ్లను క్రష్ చేసే యంత్రాలను చెన్నై సెంట్రల్, ఎగ్మూర్, జోలార్‌పేట, తిరుచ్చి, కోయంబత్తూరు వంటి దక్షిణ రైల్వే పరిధిలో ఆ శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాలను వినియోగించే ప్రయాణీకుల మొబైల్ ఫోన్లకు రీచార్జ్, టాపప్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
