అమరావతి నగర నిర్మాణంపై త్వరితగతిన సమీక్ష జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది.
ఇప్పటి వరకు రచించిన.. అమరావతి నగరాభివృద్ధి ప్రణాళికలు, రాజధాని నగరంతో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి వ్యూహాలపై ఈ సమీక్ష జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం విడుదల చేసిన జీఓ 585లో పేర్కొంది.
ఈ కమిటీలో సభ్యులు..
- ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్, డీన్ (అకడమిక్), స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూదిల్లీ
- డాక్టర్ అంజలీ మోహన్, అర్బన్ అండ్ రీజినల్ ప్లానర్
- ప్రొఫెసర్ శివానంద స్వామి, సీఈపీటీ, అహ్మదాబాద్
- ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, ఎస్‌పీఏ (రిటైర్డ్), దిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దిల్లీ
- డాక్టర్ కేవీ అరుణాచలం, రిటైర్డ్ ఛీఫ్ అర్బన్ ప్లానర్, చెన్నై
అయితే, ఈ కమిటీ పర్యావరణ సమస్యలు, ముంపు నిర్వహణకు సంబంధించిన నిపుణుడు ఒకరిని సభ్యుడిగా ఎంచుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఈ నిపుణుల కమిటీకి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపింది.
