న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ (అక్రమ నగదు లావాదేవీలు)కు పాల్పడ్డారని అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కస్టడీ నేటితో ముగిసిపోతుంది. శుక్రవారం మద్యాహ్నం ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి మొత్తం డీకే. శివకుమార్ ఆసుపత్రిలోనే ఉన్నారు. డీకే శివకుమార్ కు బెయిల్ రాకుంటే తీహార్ జైలుకు పంపించే అవకాశం ఉందని సమాచారం.
