కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ తీహార్ జైల్లో ఆందోళనతో ఉన్నారని, ఈడీ అధికారులు ఎవర్ని విచారణ చేసినా ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం. తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్, మామ తిమ్మయ్య తదితరులను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న సమయంలో ఒకటే టెన్షన్ పడిపోతున్నారని సమాచారం.
ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కుమార్తె ఐశ్వర్యను చూసిన వెంటనే డీకే. శివకుమార్ కుప్పకూలిపోయారు. వెంటనే డీకే. శివకుమార్ ను రామ్ లోహియా ఆసుపత్రికి తరలించించి చికిత్స చేయించారు. డీకే. శివకుమార్ ను అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆయన కుమార్తె ఐశ్వర్యను విచారణ చేసి వివరాలు సేకరించారు.
