న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సిబిఐ కస్టడీని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అరెస్టు అయిన తర్వాత చిదంబరం బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈనెల 5వరకు చిదంబరానికి కస్టడీని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 5న బెయిల్ పిటిషన్‌ను విచారించాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అప్పటివరకు చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపవద్దని న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
