మరికొన్నిగంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టంకు తెరలేవబోతోంది. చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ చంద్రయాన్-2 సెప్టెంబర్ 7 శనివారం తెల్లవారుజామున 1:30 గంటల నుంచి 2:30 గంటల మధ్య చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంపై ల్యాండ్ కానుంది.విక్రమ్ ల్యాండర్‌ను సేఫ్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 1 గంట నుంచి 2 గంటల మధ్య విక్రమ్ ల్యాండర్‌కు ఛార్జింగ్ ఇవ్వనుంది. ఇక ఈ మొత్తం ప్రక్రియను బెంగళూరు నుంచి ప్రధాని మోడీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. మోడీతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇస్రో ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థులు ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తారు.
