మోసగించడమే లక్ష్యంగా టెలిఫోన్ కాల్స్ చేయడానికి భారత రాయబార కార్యాలయం టెలిఫోన్ లైన్లను కొందరు మోసగించి ఉపయోగిస్తున్నట్లు దౌత్యకార్యాలయానికి తెలియ వచ్చింది.
వీటిలో కొన్ని కాల్స్ ఎంబసీ టెలిఫోన్ నంబర్ (973-17560360) నుండి వచ్చినట్లు చూపించగా, ఇతరులు ఎంబసీ గుర్తింపును ఉపయోగిస్తున్నారు. ఈ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వివరాల వంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్నట్లు తేలింది. లేదా వారి పాస్పోర్ట్, వీసాలలో , ఇమ్మిగ్రేషన్ దస్తావేజులలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, భారతీయుల నుండి డబ్బును గుంజటానికి ప్రయత్నిస్న్రున్నారని తెలియ వచ్చింది. అదే సమయంలో లోపాలు సరిచేయకపోయినట్లయితే, , బహ్రెయిన్ నుండి భారతదేశానికి పంపించివేయటం కానీ లేదా వారిని బెహ్రైన్లో ఖైదు చెయ్యటం కానీ జరుగుతుందని భయపెట్టి, కొన్ని సందర్భాల్లో, ఈ మోసదారులు భారతదేశంలో ఎంబసీ లేదా ఇతర అధికారుల నుండి ఇటువంటి విశేష సమాచారాన్ని పొందారని కూడా తప్పుగా పేర్కొన్నారు. వీసా దరఖాస్తుదారులు కూడా అటువంటి కాల్స్ ఎంబసీ నుండి భావించారు.
ఎంబసీ నుండి అధికారులు ఏ భారతీయ లేదా విదేశీ జాతీయుల నుండి వ్యక్తిగత సమాచారం కోరుతూ ఏ టెలిఫోన్ కాల్స్ చేయలేదని మేము నిర్ధారిస్తున్నాము . ఇప్పటికే ఉన్న దరఖాస్తుదారు నుండి ఏవైనా అదనపు పత్రాలు అవసరమైతే, ఇది ఇమెయిల్ డొమైన్ (mea.gov.in) నుండి వచ్చిన ఇమెయిల్ (లు) ద్వారా మాత్రమే కోరబడుతుంది.
భారత రాయబార కార్యాలయం యొక్క పేరుతో చేసిన అనుమానాస్పద టెలిఫోన్ కాల్స్ను పట్టించుకోవద్దని భారత రాయబార కార్యాలయం ప్రజలకు సూచించింది. వారు వ్యక్తిగత సమాచారం బహిర్గతం లేదా అలాంటి కాల్స్ ప్రతిస్పందనగా ఏ డబ్బు బదిలీ లేదా ఎటువంటి సమాచారాన్నయినా : ఇ-మెయిల్ ID : [email protected], [email protected] పై ఈ అంశాలను తీసుకురావచ్చని తెలియజేసారు.
సిసెల్ పనయిల్ సోమన్
ముఖ్య కార్యనిర్వహణాధికారి, మిడల్ ఈస్ట్, ఇండ్ సమాచార్, బెెహరైన్.
