వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి హూస్టన్‌లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ విలక్షణ శైలికి సంబంధించిన ఒక అరుదైన దృశ్యం కనిపించింది. మోదీకి స్వాగతం పలుకుతూ అందించిన బొకేలోని ఒక పుష్పం కిందపడిపోయింది. దీనిని గమనించిన మోదీ స్వయంగా కిందకువంగి ఆ పుష్పాన్ని తీసుకుని అక్కడే ఉన్న సైనికాధికారి చేతికి అందించారు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఒక అధికారి మోదీకి స్వాగతం పలుకుతూ ఒక బొకేను అందించారు. ఇంతలో దానిలో నుంచి ఒక పూవు కింద పడిపోయింది. దీనిని గమనించిన మోదీ కిందకు వంగి దానిని తీశారు. ఈ సమయంలో యుఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్, అమెరికాలోని భారతీయ రాయభారి హర్ష్‌వర్థన్ అక్కడే ఉన్నారు.
