న్యూఢిల్లీ: అసోంలో ఎన్నార్సీ పూర్తిస్థాయి జాబితాను కేంద్రం విడుదల చేసింది. మొత్తం 3.30 కోట్ల మంది దరఖాస్తుదారుల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఎవరు జాబితాలో ఉన్నారో ఎవరు లేరో ఈ జాబితాను పరిశీలించి తెలుసుకోవచ్చు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల వివరాలు ఉమ్మడి కామన్ ఎన్‌ఆర్‌సిలో చూసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను జాబితాలో ఉంచారు. వారి వారి ఎన్‌ఆర్‌సి స్థితిని బట్టి తెలుసుకోవచ్చు. ఎన్నార్సీ తుది జాబితా విడుదల సందర్భంగా కేంద్రం అసోంలో భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగపోవటంతో పాటు పరిస్థితి ప్రశాంతంగా ఉండటంతో కేంద్రం బలగాలను ఉప సంహరించుకుంటుంది. శనివారం 100 కంపెనీల బలగాలను వెనక్కి పంపారు.
