సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క్రమంలో శనివారం (సెప్టెంబర్ 14)న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఫ్లోర్‌ను క్లీన్ చేశారు.
దేశ సేవ కోసమే ప్రధాని మోదీ తన జీవితాన్ని అంకితం చేశారనీ..పేదల కోసం మోడీ చేస్తున్న సేవలు అనితరసాధ్యమని ప్రశంసించారు. ఆయన దేశం కోసం చేసిన త్యాగం..పేదల కోసమే నేను అన్నట్లుగా నిత్యం కృషి చేస్తున్నారనీ తెలిపారు. మోడీ పుట్టిన రోజు కార్యక్రమాన్ని సేవా సప్తాహ్ పేరుతో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటరాని దీంట్లో భాగంగా హాస్పటల్‌ను శుభ్రం చేశామని షా అన్నారు. మోడీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను.. సేవా సప్తాహ్ పేరుతో నిర్వహించనున్నట్లు అమిత్ షా చెప్పారు. హాస్పటల్లో చిన్నపిల్లలు చికిత్సపొందే వార్డుకు వెళ్లిన షా..చిన్నారులందరికీ పండ్లు పంపిణీ చేశారు.
