చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కే. తహిల్ రమణి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇటీవలే జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ కోర్టుకు బదిలి చేశారు. తన బదిలి ప్రతిపాదనను పరిశీలించాలని మనవి చేసినా ఫలితం లేకపోవడంతో జస్టిస్ తహిల్ రమణి మద్రాసు హై కోర్టు చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేశారు. మేఘాలయ హైకోర్టుకు బదిలీ కావడానికి విముఖంగా ఉన్న జస్టిస్ తహిల్ రమణి ఆమె పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.
