పంజాబ్ : భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మళ్లీ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానాన్ని అభినందన్ నడిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న బాలాకోట్ వైమానిక దాడి తర్వాత మళ్లీ యుద్ధ విమానాన్ని అభినందన్ నడిపించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్ వైమానిక దాడిలో అభినందన్ మిగ్‌ను నడిపారు. ఫైటర్ విమానాలు జరిపిన డాగ్‌ఫైయిట్‌లో.. ఫిబ్రవరి 27వ తేదీన అభినందన్‌కు చెందిన మిగ్-21 పాక్‌లో కూలింది. పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలను తరుముతూ వెళుతున్న క్రమంలో అతడు ప్రయాణిస్తున్న మిగ్-21 బైసన్ విమానం దారితప్పింది. పాక్‌కు చెందిన ఎఫ్-16ను అభి నేలకూల్చాడు. మార్చి 1వ తేదీన అతన్ని పాక్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత సెలవుల్లో ఉన్న అభినందన్ తిరిగి ఇటీవల విధుల్లో చేరారు.
