కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ పై యూ టర్న్ తీసుకున్నారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. రాహుల్ గాంధీ ఇన్నాళ్లు బాధ్యత రహితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు…దీంతో ఇన్నాళ్లు భారత దేశాన్ని అవమానించారని ఆయన ఫైర్ అయ్యారు… కశ్మీర్‌లో హింసాత్మక చర్యలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలనే పాకిస్థాన్ ఉపయోగించుకుందని అన్నారు.
ఈనేపథ్యంలోనే రాహుల్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేశారని ఆరోపించారు.అంతకుముందు కశ్మీర్ పై ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ కశ్మీర్ భారత అంతర్గతమని తేల్చి చేప్పారు. దీంతో ఆగస్టు 5వ తేదీన కశ్మీర్ అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా సానూకూలంగా స్పందించింది.
పార్టీ పరంగా కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పిన రాహుల్ గాంధీ, కశ్మీర్ పూర్తిగా భారత దేశ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. కశ్మీర్ పై పాకిస్థాన్ సహ ఇతర దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మద్దతు వల్లే కశ్మీర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందనేది ప్రపంచానికి తెలిసిందే కదా అంటూ ట్వీట్టర్లో పేర్కోన్నారు.
