అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవుతారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకొని, 11 గంటలకు హోం శాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. తిరిగి మంగళవారం ఉదయం విజయవాడకు చేరుకుంటారు.
