హైదరాబాద్: మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పోలీసులు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ థాకరేను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ ముంబైలో 144వ సెక్షన్‌ను విధించారు. సీటీఎన్ఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో అక్రమరీతిలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు 450 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంటున్నది.
రాజ్ థాకరే ఈడీ ఆఫీసుకు వస్తున్న నేపథ్యంలో ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్‌థాకరే భార్య శర్మిల, కుమారుడు అమిత్, కూతురు ఊర్వశి కూడా ఈడీ ఆఫీసుకు వెళ్లారు.
