ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎమ్మెల్యే పదవికి, టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వ్యవహారం దుమారం గా మారింది. వల్లభనేని వంశీ మోహన్, చంద్రబాబుకు తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ లేఖ రాశారు.ఇక చంద్రబాబు సమాధానంగా లేఖ రాశారు. వ్యక్తిగతంగా తను అండగా ఉంటానని, కేసులకు , వేధింపులకు భయపడకుండా పోరాటం చెయ్యాలని పేర్కొన్నారు. రాజీనామా ఆలోచనే విరమించుకోవాలని చంద్రబాబు వంశీ మోహన్ కు సూచించారు. ఇక వంశీ మోహన్ కు చంద్రబాబు నాయుడు రాసిన లేఖతో వంశీ స్పందించారు. వంశీ చంద్రబాబు లేఖ కు ప్రత్యుత్తరంగా మరోమారు తన స్పందన తెలియజేశారు.చంద్రబాబు వంశీ స్పందన
చంద్రబాబు లేఖపై వంశీ స్పందన
ఇక ఆ లేఖలో వంశీమోహన్ తన లేఖ పై చంద్రబాబు స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకాలం తాను చంద్రబాబు అడుగు జాడల్లో నడిచానని, ప్రభుత్వ హింసను ఎదుర్కొన్నానని అన్నారు. ఇక అంతే కాదు తనకు కృష్ణాజిల్లాలో టీడీపీ శ్రేణుల నుండి కానీ, పార్టీ నుండి కానీ మద్దతు లభించకపోయినా, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో పోరాటం సాగించానని పేర్కొన్నారు. అన్యాయాలను ఎదుర్కోవడానికి అలుపెరుగని పోరాటం చేశానన్నారు.
ఎన్నికల ముందు నుండి జరిగిన రాజకీయ పరిణామాలు అన్ని చంద్రబాబుకు తెలుసు అని పేర్కొంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ వద్దని తనపై ఒత్తిడి వచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించారు. కనబడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టమని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసిన పలు సందర్భాలను గుర్తుచేస్తూ పార్టీలోనూ తాను ఇబ్బంది పడ్డ పరిస్థితులను వివరించారు. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని గుర్తు చేశారు వంశీ.
