ఎయిర్ ఇండియా చరిత్ర సృష్టించింది. ఎయిర్ బస్ కమర్షియల్ విమానాల కోసం ప్రపంచంలోనే తొలిసారిగా టాక్సీబాట్లు ప్రవేశపెట్టిన సంస్థగా రికార్డు నెలకొల్పింది. ఎయిర్ ఇండియా చైర్మన్ మానేజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహానీ ముంబై ఎయిర్ పోర్టులో మంగళవారం వీటిని లాంఛనంగా ప్రారంభించారు. టాక్సీబాట్(ట్రాక్టర్ వంటి వాహనం) సాయంతో విమానాన్ని పార్కింగ్ స్థలం నుంచి సునాయసంగా రన్‌వైపై తీసుకురావచ్చు(టాక్సీయింగ్). టాక్సీబాట్ల రాకమునుపు విమానాన్ని రన్‌వేపైకి చేర్చాలంటే విమనాం ఇంజన్లను ఆన్ చేయాల్సి వచ్చేది. చాలా ఇంధనం కర్చు చేయాల్సి వచ్చేది. టాక్సీబాట్ల రాకతో టాక్సీయింగ్కు అవసరమయ్యే ఇంధనంలో దాదాపు 85శాతం పొదుపు చేయచ్చోని ఎయిర్ ఇండియా వర్గాలు ధృవీకరించాయి. కర్బన ఉద్గారాలు తగ్గించే దిశగా ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి డిపార్టింగ్ విమానాల కోసమే ఈ టాక్సీబాట్లను వినియోగించనున్నట్టు సమాచారం.
