భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు గ్జిన్‌పింగ్ చెన్నైకి చేరుకుంటారు. చైనా రాజధాని బీజింగ్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా చెన్నై విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి చెన్నై శివార్లలోని మామళ్లాపురం పట్టణానికి బయలుదేరి వెళతారు. ఇక్కడే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. జిన్‌పింగ్ కాన్వా§్‌ు వాహనాలు చెన్నైకి చేరుకున్నాయి. ఆ వాహనాల్లోనే ఆయన ప్రయాణిస్తారు. సముద్ర తీర ప్రాంతమైన మామళ్లాపురంలో సమవేశం జరగడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టణాన్ని సురదరంగా తీర్చిదిద్దారు. జిన్‌పింగ్‌తో పాటు వచ్చే అధికారులకు బస ఏర్పాటుచేశారు. తొలిసారిగా తమ రాష్ట్రానికి రానున్న జిన్‌పింగ్‌కు చెన్నై విద్యార్థులు వినూత్నంగా స్వాగతం పలుకుతున్నారు. చెన్నైలోని ఒక కళాశాల విద్యార్థులు జిన్‌పింగ్ మాస్క్‌లు ధరించి ఆయన చిత్రపటాన్ని తమ కళాశాల మైదానంలో ఆవిష్కరించారు. ఆ చిత్రపటం ముందు చైనా లిపిలో స్వాగతం పలుకుతూ ఆసీనులయ్యారు. సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఆసియాలోనే అత్యంత శక్తిమంతమైన చైనా దేశాధ్యక్షుడు రావడం గర్వంగా ఉందని విద్యార్థులు వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్ భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి.
దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతుండటం తొలిసారి. చైనా దేశాధ్యక్షుడు స్వయంగా భారత పర్యటనకు వస్తున్నారంటే రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్యపరమైన కీలక ఒప్పందాలు చోటు చేసుకోవచ్చని ఊహాగానాలు చెలరేగడం సహజం. వాటన్నంటినీ భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికారులు ముందే తోసిపుచ్చారు. జిన్‌పింగ్, నరేంద్రమోడీ సంయుక్త విలేకరుల సమావేశం కూడా ఉండదని నిర్ధారించారు. ఈ రెండూ తమ దేశాధ్యక్షుడి భారత పర్యటన షెడ్యూల్‌లో లేవని చైనా రాయబార కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. జమూకాశ్మీర్‌క స్వయంప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత జిన్‌ప్‌ిం భారత పర్యటనకు రావటం ఆసక్తికరంగా మారింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ను రెండు విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆర్టికల్ 370 రద్దు వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి ప్రపంచస్థాయి అత్యున్నత వేదికల మీద ప్రస్తావనకు తీసుకొచ్చి ఫలితాలను చవి చూసింది. అయితే మనదేశంతో కంటే చైనాకు పాకిస్థాన్‌తోనే ఎక్కువ స్నేహ సంబంధాలున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా కూడాఆర్టికల్ 370 రద్దు వ్యవహారంలో పాకిస్థాన్‌కు సహాయం చేయలేకపోయింది. జిన్‌పింగ్ భారత పర్యటనకు రావడం, ఒప్పందాలు చోటు చేసుకోవడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
